IndiaLatest

సామూదిరి వారి ఊరులో శాంతిగిరి విశ్వజ్ఞాన మందిరం ప్రారంభం

“Manju”

కక్కోడి :-సాహోదర్యానికీ , సహృదయతకీ మారు పేరుగా నిలిచిన సామూదిరి వారి ఊరుకి మరో విస్మయ భవనం కూడా సమర్పించబడుతోంది. కోజికొడులో కక్కోడి అనావ్ కొండ పైన నిర్మాణం జరుగుతున్న మనోహర భవనానికి విశ్వజ్ఞాన మందిరం అనే పేరు పెట్టడం జరిగింది .గురు స్థానీయ శిష్య పూజిత అమృత జ్ఞాన తపస్విని ఏప్రిల్ 9 న దీప ప్రజ్వలన చేసి ప్రారంభించటంతో, ఈ విశ్వజ్ఞాన మందిరం ఊరికి అంకితమవుతుంది.
1995 లో గురు ఆదేశానుసారం బోడికొండగా వున్న అనావ్ కొండ మీద ఆశ్రమం కోసం పదమూడున్నర ఎకరాలు కొనటం జరిగింది.
తరువాత చదును చేసిన భూమి పైన తొలి దశలో వృక్ష లతాదులు,ఫల వృక్షములు నాటటం జరిగింది .2005 లో శిష్య పూజిత అమృత జ్ఞాన తపస్వి ఈ భూమి సందర్శించినప్పుడు ఒక తాత్కాలిక భవనంలో దీప ప్రజ్వలన చేయటంతో ఆశ్రమం తాలూకా శాఖ ఇక్కడ పని చేయటం ప్రారంభించింది.
2014 జనవరి 5న ప్రార్థనాలయానికి శిష్య పూజిత అమృత జ్ఞాన తపస్వి పునాదిరాయి వేశారు. నిటారుగా వున్న కొండమీద నిర్మాణం చేయటం అసలు సులువుగా జరగలేదు 2015 మే ఒక్కటో తారీఖు నుంచి ,ఈ రోజు వరకు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా గురు భక్తులు ఒళ్ళు మరిచి చేసిన ఆత్మ సమర్పణ వల్లనే నేడు విశ్వవిజ్ఞాన మందిరం , ఊరుకి అంకితం చేయబడుతోంది.72 అడుగుల ఎత్తుతో ప్రతి అంతస్తులోనూ, పూర్తిగా వికసించిన 12 నుంచి 36 దళముల తామర పువ్వు ఆకారంలోని శిల్పం, ఇది లోపల శిల్ప చాతుర్యానికే విస్మయం కలిగించే 22స్తంభములు మూడు అంతస్తుల తో తల ఎత్తి నిలిచే ఆత్మీయ భవనం లోని క్రింద అంతస్తులో మధ్యభాగం లో వున్న మండపం పైన ,నవజ్యోతి శ్రీ కరుణాకర గురు గారి తైలఛాయా చిత్రం ప్రతిష్టింపబడుతుంది –పై అంతస్తులో గురువు గారు వాడిన వస్తువుల ప్రదర్శనశాల ఉంటుంది.
ఆలప్పుళ కి చెందిన విక్టర్ పైలికోన్ సెప్ట్ ఈ కట్టడానికి రూపకల్పన చేసారు. సుప్రసిద్ధ పోటోగ్రాపర్ ఎస్.కుమార్ లైటింగ్ డిసైన్ చేసారు .తామరాకారంలోని పర్ణశాలకు లైటింగ్ డిసైన చేసింది కూడా ఈయనే .సుప్రసిద్ధ సంవిధాయకుడు రాజీవ్ ఆంచల్ నిర్మాణ కార్య కలాపాలను
పర్యవేక్షించారు
కొండ పైన నిర్మించబడిన మందిరమే కాదు, చుట్టూ వున్న అందమైన ప్రకృతి వర్ణనాతీతమైన ఆకాశదృశ్యాలు వగైరాలు కూడా రాబోయే రోజుల్లో కోజికోడ్ గుండెలో చోటు సంపాదిస్తుందనేది ఖాయం. జాతి మత భేదాలకు అతీతంగా ,ఎవరైనా ఈ మందిరాన్ని సందర్శించవచ్చు .ఇది ఒక ప్రత్యేకమైనది. విశ్వజ్ఞాన మందిరం ప్రజలకు అంకితం చేసే కార్యక్రమం కోజికోడ్ నగరానికే పండుగ అవుతుంది .ఏప్రిల్ 2 న కోజికోడ్ బీచ్ లో సంగీత కచ్చేరి మరియు 3న ఫ్రీడం స్కయర్ లో దీపోత్సవం జరుగుతాయి . శాంతిగిరి విశ్వజ్ఞాన మందిరం అంకితం చేసినప్పుడు వాధ్య ఘోష [కేళి కొట్టు ]ఉంటుంది.
4న ఇఫ్తార్ ,5న కవి సమ్మేళనం ,
6న కళాంజలి 7న ఎదురుకోలు
8న మెగా మెడికల్ క్యాంప్ మొదలగు వివిధ కార్యక్రమాలకే కాక జీవకారుణ్య కార్య కలాపాలకు కూడా వేదికగా మారుతుంది నగరం
ఏప్రిల్ 7న కక్కోడి చేరుకో పోయే శిష్య పూజిత కు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు సన్యాసివర్యులు,గురుభక్తులు కూడా .9న విశ్వజ్ఞాన మందిరం లో దీప ప్రజ్వలన చేస్తారు శిష్య పూజిత .10 న తీర్థయాత్రాబృందం తిరువనంత పురానికి తిరిగి వెళ్ళి పోతుంది
ఏప్రిల్ 2నుంచి 9 వరకు జరిగే వివిధ సమావేశాల్లో రాజకీయ సామాజిక ఆద్యాత్మిక సాంస్కృతిక రంగాల్లోని ప్రముఖలు హాజరవుతారు.

Related Articles

Back to top button